Master Viswam-మాసటర్ విస్వం
పరిచయం (Introduction) : మొదటి బాలతారల కథ!-- మాసటర్ విస్వం -రావి కొండలరావు గారి సౌజన్యముతో.. 'నేను జగ్గయ్యపేటలో ఉన్నప్పుడు, మాయింటికి ఎదురుగా 'బాలనాగమ్మ'లో నటించిన విశ్వం తల్లితండ్రులుండేవారు. విశ్వం అప్పుడు బాలనటుడిగా సినిమాల్లో నటిస్తున్నాడు. మావూరి వాళ్లందరికీ విశ్వం పెద్ద ఆకర్షణ. నేనూ విశ్వాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఆతర్వాత వాళ్లు నల్గొండకి మారారు. విశ్వం తండ్రిగారి పేరు ఉప్పల పుల్లయ్య. నల్గొండలో ఆయన హోటల్ నడిపేవాడు. ఒకసారి విశ్వం నల్గొండ రాగా, ఊరు వూరంతా అతన్ని చుట్టుముట్టింది. మానాన్నగారు జ్యోతిష్యం చేప్పేవారు. పుల్లయ్యగారికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉండడం వల్ల మానాన్న గారు, ఆయన దగ్గర మిత్రులయ్యారు. నేనూ, విశ్వం దాదాపు సమ వయస్కులం. ఐతే నేను కాస్త పెద్ద. మేమిద్దరం స్నేహితులమయ్యాం. విశ్వం మాద్రాసులోని స్టూడియోలు, నటీనటులు, షూటింగుల గురించి చెబుతూ ఉంటే, ఆసక్తిగా వినే వాడిని. నేనూ సినిమా ప్రయత్నాలు చెయ్యడానికి విశ్వం ప్రేరణ బాగా వుంది''. -ఇలా రాసుకున్నది సుప్రసిద్ధ చలన చిత్రనటుడు - టి.ఎల్.కాంతారావు, ఈ విశ్వం ఎవరు? ఆరోజుల్లో అతని...