Posts

Showing posts with the label Dasarathi Rangacharya(Writer)-దాశరథి రంగాచార్య(ప్రముఖ రచయిత)

Dasarathi Rangacharya(Writer)-దాశరథి రంగాచార్య(ప్రముఖ రచయిత)

Image
పరిచయం (Introduction) :  రాలిపోయిన మోదుగుపువ్వు - ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత -అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి -నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు  సాహితీ శిఖరం కూలిపోయింది. తెలంగాణ మోదుగుపువ్వు రాలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య(86) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. గుండె, వూపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటూ... రెండేళ్ల నుంచి యశోదలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు. సికింద్రాబాద్‌, వెస్ట్‌మారేడుపల్లిలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను సాయంత్రం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తపోటుతోపాటు చక్కెర బాగా పెరిగింది. ఎంత ప్రయత్నించినా నియంత్రణలోకి రాలేదు. సోమవారం ఉదయానికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీర భాగాలు వైద్యానికి స్పందించకపోవడంతో చివరికి ఆరు గంటల సమయంలో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య కమల, ముగ్గురు పిల్లలు విరించి, ఉదయశ్రీ, సుధ ఉన్నారు. ఆ...