గిరిజ (గీతాంజిలి ఫిల్మ్ ) , Girija(geetanjili film)
------------------------------------------ పరిచయం : తెలుగు సినీరంగములో గిరిజ గా పరిచయమైన గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్ (Girija Emma Jane Shettar) తెలుగు సినిమా నటి . మణిరత్నం దర్శకత్వం వహించిన తెలుగు సినిమా గీతాంజలిలో కథానాయికగా ప్రసిద్ధురాలు . ఈమె వందనం అనే మళయాల చిత్రము ద్వారా చిత్రరంగములో ప్రవేశించింది . గిరిజ తండ్రి భారతీయుడు , తల్లి ఇంగ్లాండుకు చెందినది . ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది . భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది . 1998 లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం . ఏ కోర్సు పూర్తిచేసి , అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది . గిరిజ ప్రస్తుతము రచయితగా లండన్లో స్థిరపడింది . ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉన్నది . గీతాంజలి చిత్రంలో అల్లరి సృష్టించి తెలుగువారి మనసులను దోచుకున్న సుందరి గిరిజ ప్రొఫైల్ : పే...