Posts

Showing posts with the label Rusyendramani - ఋష్యేంద్రమణి

ఋష్యేంద్రమణి-Rusyendramani

Image
======================== పరిచయం : ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటి. ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని, నాట్యాన్నిఅభ్యసించారు. కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీవిలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వులరామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద శిక్షణ పొందారు. ప్రొఫైల్ : పేరు : రుస్యేంద్ర మణి , పుట్టిన తేదీ : 01-జనవరి -1917 , పుట్టిన స్థలము : విజయవాడ , భర్త : జవ్వాది రామకృష్ణారావు , మరణము : 17- ఆగస్టు -2002 . కెరీర్ : ఆనాడు రాజారావు నాయుడు నిర్మించిన ' శ్రీకృష్ణ తులాభారం' చిత్రంలో సత్యభామ పాత్ర ధరించారు. ఆ చిత్రంఅపజయం కావడంతో తిరిగి నాటకరంగంలో ప్రవేశించి ప్రహ్లాద, రాధాకృష్ణ, చింతామణి, తులాభారం మొదలగునాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించారు. ఆనాడు కడారు నాగభూషణం , పసుపులేటి కన్నాంబ నడిపిన రాజరాజేశ్వరీ నాట్యమండలితో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. భర్త జవ్వాది రామకృష్ణారావు 'మాతృభూమి' అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూ...