రంగ బి యస్ ,Ranga B S
-- ఫరిచయం(introduction) : ఛాయాగ్రాహకుడు, దర్శకుడు, నిర్మాత, విక్రమ్ స్టూడియో అధినేత బి.ఎస్.రంగా ఆదివారం చెన్నైలో కన్నుమూయడంతో మరో ప్రతిభాశాలిని భారతీయ చిత్ర పరిశ్రమ కోల్పోయింది. 93 ఏళ్ల వయసు కలిగిన రంగా ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ 'తెనాలి రామకృష్ణ', 'అమరశిల్పి జక్కన', 'వసంతసేన', 'భక్త మార్కండేయ' చిత్రాల సృష్టికర్తగా ఆయన పాతతరం ప్రేక్షకులకు సుపరిచితులే. తెలుగులో తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం 'అమరశిల్పి జక్కన' ను నిర్మించిన ఘనత ఆయనదే. అలాగే 'తెనాలి రామకృష్ణ'చిత్రానికి రాష్ట్రపతి పతకం కూడా పొందారు. 45 చిత్రాలకు ఛాయాగ్రాహకునిగా, అయిదు భాషల్లో 55 చిత్రాలకు నిర్మాతగా, దర్శకునిగా రంగా పనిచేశారు. స్వతహాగా కన్నడిగుడైనా ఆయన కన్నడ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించారు. జీవిత విశేషాలు(Profile) : పేరు : బి.యస్ . రంగా , పూర్తి పేరు : బిందిగనవాలే శ్రీనివాస్ అయ్యంగర్ రంగా , పుత్తిన తేదీ : 11 నవంబర్ 1917 , పుట్టిన ఊరు : మగడి గ్రామము -- బెంగళూర్ సమీపములో , తండ్రి : శ్రీనివాస్ అయంగర్ , మర...