Chalam.B(cinima art driector)-చలం.బి(కళా దర్శకుడు)
image : courtesy with Eenadu cinema paper. పరిచయం (Introduction) : ఏ పనిలో విజయం సాధించాలన్నా - తపన, కృషి అవసరం అని పెద్దల మాట. ఈ మాటను ప్రపంచంలో ఎందరో రుజువు చేశారు. సినిమా ప్రపంచంలోనూ చేశారు. సినిమా దర్శకత్వ శాఖలో కేవలం అప్రెంటిస్‌గా చేరి- గొప్ప దర్శకులయి పేరు తెచ్చుకున్నవాళ్లు కొందరైతే, మొదట్లో ఎడిటింగ్ ఫిల్ము డబ్బాలను మోసి తిరిగినవాళ్లు- ప్రసిద్ధ ఎడిటర్లయిన వాళ్లు కొందరు. అలాగే ఛాయాగ్రాహకులు, ఇతర టెక్నీషియన్లూ..! కళా దర్శకుల విభాగాన్ని పరిశీలిస్తే - స్టూడియోలో బ్యాగ్రౌండ్ పెయింటింగ్ శాఖలో సహాయకుడిగా చేరి తరవాత తరవాత ఎదిగిన వారు... బి.చలం. కళా దర్శకుడిగా తన శైలిని వెండి తెరపై చూపించారాయన. జీవిత విశేషాలు (profile) : పేరు : బి.చలం -- కళా దర్శకుడు , పుట్తిన తేదీ : 1933 లో, జన్మస్థలము : పర్లాకిమిడి (ప్రస్తుతము ఒరిస్సా రాస్ట్రము ), చదువు : 10 వ తరగతి , కెరీర్ : బొమ్మలు గీయడం అంటే మహా ఉత్సాహం. అనేక మంది చిత్రకారులు వేసిన చిత్రాలను పరిశీలిస్తూ తానూ చిత్రాలు వేశారు. స్కూలు చదువు తరవాత ఏం చెయ్యాలి? సినిమాలు చూసి, సినిమాలు మీద ఉత్సాహం పెంచుకుని- శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మద్రాసు చే...