Telugu girl-Pragati in bollywoodబాలీవుడ్‌లో తెలుగమ్మాయి-ప్రగతి
పరిచయం (Introduction) : మొదట మోడలింగ్. తరవాత చిన్న సినిమాలు. అదృష్టం కలిసొస్తే అప్పుడు ప్రధాన పాత్రలు. సాధారణంగా ఇదీ సినిమా రంగంలో అడుగుపెట్టే నాయికల పరిస్థితి. కానీ అనంతపురం అమ్మాయి ప్రగతి... ఎకాఎకి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అదీ మామూలుగా కాదు... న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని. 'మంచి అవకాశాలొస్తే తెలుగులో నటించడానికీ సిద్ధమే' అంటూ ఆమె ఇంకా ఏం చెబుతుందంటే...! 'ఎవరైనా సినిమాల్లో నటించాలనుకుంటే హైదరాబాద్‌కో, చెన్నైకో వెళ్తారు. నువ్వేంటి అమెరికా వెళ్తున్నావు' అంటూ చాలామంది అడిగారు. ఏది చేసినా పక్కాగా ఉండటమే నాకిష్టం. సహజంగా నటించడం నేర్చుకోవాలంటే అంతర్జాతీయ స్థాయి సంస్థలోనే శిక్షణ తీసుకోవాలని అనిపించింది. అందుకే హైదరాబాద్‌లో బీటెక్ అయిపోగానే అమెరికా వెళ్లే విమానమెక్కేశా. న్యూయార్క్‌లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిపోయా. అక్కడికి వెళ్లాకే తెలిసింది నటించడంలోనూ రకరకాల పద్ధతులుంటాయని. మరోవైపు సుమారు పదిహేను రకాలకు పైగా నృత్య రీతుల్ని అక్కడ నేర్చుకున్నా. నాలుగేళ్ల వయసు నుంచే నేను కథక్ నేర్చుకుంటున్నా. హరిహరకళాభవన్,...