సూర్యప్రకాశరావు కొవెలమూడి-Suryaprakasharao
కోవెలమూడి సూర్యప్రకాశరావు (1914 - 1996) తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి జీవితం సూర్యప్రకాశరావు 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కొలవేనులో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు. సినీరంగ ప్రవేశం ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహి...