Nadhiya(zareena)-నదియా(జరీనా)
పరిచయం (Introduction) : సాధారణంగా వృత్తిలో ప్రమోషన్లు ఉంటాయి. సినిమారంగంలో కూడా సహ నటి, సహాయ నటి వంటి వేశాలు..ఆ తరువాత కొంచె వయసు ముదిరాక అక్క, వదిన వేశాలు..ఆ తరువాత అమ్మ, అత్త పాత్రలు వేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుండో సినిమారంగంలో ఉంటూ వస్తున్నదే. బజారు రౌడీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయిన తమిళ, మళయాళ నటి నదియా ఆ తరువాత ఓ తండ్రి ఓ కొడుకు అనే తెలుగు సినిమా చేసిన తరువాత తెరమరుగయింది. 1994లో ఈ సినిమా వచ్చిన తరువాత ఆమె ఆ తరువాత కనిపించలేదు. పెళ్లి చేసుకుని కుటుంబ వ్యవహారాలు ఊసుకుంటూ ఉండిపోయింది. అయితే ఆ తరువాత మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నదియా ఈ సారి తెలుగులో దూసుకుపోతుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన నదియా ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధిండంతో నదియాకు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వయసు పెరిగినా గ్లామర్ తగ్గకపోవడంతో అత్త, అమ్మ పాత్రలు చేస్తున్న నదియాకు ప్రిన్స్ మహేష్ బాబుకు సోదరిగా నటించే అవకాశం లభించింది. శ్రీనువైట్ల – మహేష్ బాబుల కాంబినేషన...