సతీశ్ (మహమ్మద్ షఫీ),Satish(Mohammad shafi) Still photographer
పరిచయం (Introduction) : స్టిల్ ఫోటోగ్రాఫర్ సతీశ్ ఆకస్మిక మృతి-- 18 జనవరి 2011. స్టిల్ ఫోటోగ్రాఫర్ సతీశ్ (మహమ్మద్ షఫీ) మంగళవారం సాయంత్రం స్వస్థలం మచిలీపట్నంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. సతీశ్ వయసు 43 సంవత్సరాలు. చిన్న వయసులోనే చిత్రరంగంలో స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సతీశ్, అనంతరం పలు పత్రికలకు ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు.ఉదయం , సివరంజని , మేఘసందేశము, నంబర్ ఒన్, సినీ స్టార్, ట్రేడ్ గైడ్ మున్నగునవి . ఆయన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు, సినీ పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం మచిలీపట్నంలో సతీశ్ అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పడిందంటే అందుకు ఆయన చొరవే ముఖ్యమని అసోసియేషన్ అధ్యక్షుడు భద్రం, ప్రధాన కార్యదర్శి ఎం. రవి నివాళులర్పించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : సతిష్ (మహమ్మద్ షఫీ), పుట్టిన తేదీ : -.-.1977 ( 43 సం.లు) ఫుట్టిన ఊరు : బందరు - మచిలీపట్నం దగ్గర , క్రిష్ణా జిల్లా, కుటుంబ సబ్యులు : భార్య , ఇద్దరు కొడుకులు , మరణము : 18.జరవరి 2011-గుండెపోటు తో మరణించారు , నటించిన సినిమాలు (filmography ): ఎక...