మాయాబజార్‌లో రేఖ అన్నయ్య బాబ్జి
పరిచయం (Introduction) : 'మాయాబజార్' (1957)లో రూపకం వుంది. బాలకృష్ణుడి చేష్టల మీద గోపికలు యశోదకి ఫిర్యాదులు చేసే నాట్యగీతం. ఇందులో బాలుడు బాబ్జి. పుష్పవల్లి, జెమిని గణేశన్‌ల పుత్రుడు. ప్రసిద్ధ హిందీ చిత్రాల నటి రేఖకి అన్న. బాలకృష్ణుడు ఎంతో అందంగా వున్నాడని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఐతే అదే సమయంలో అతను 'భక్త మార్కండేయ'లో మార్కండేయుడిగా నటించాడు. ఈ సినిమా, 'మాయాబజార్'తో పోటీ జరిగినా, ముందుగా 1956లోనే విడుదలైంది. ఇది విక్రమ్ ప్రొడక్షన్స్ పేరిట బి.ఎస్.రంగా తీశారు. ఐతే మార్కండేయ, విడుదలైన ఎన్నో సాంఘికాల మధ్య విజయం సాధించలేకపోయిందని చెప్పుకున్నారు. తర్వాత బాబ్జి అక్కడా అక్కడా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు. ఎదిగిన తర్వాత తమిళ చిత్రాల్లో హీరోగా నటించాడు గాని, తెలుగులో నటించలేదు. తెలుగు సినిమాల్లో బాల పాత్రలతోనే సరిపోయింది బాబ్జీకి. తర్వాత బొంబాయి వెళ్లి వున్నాడని చెప్పుకున్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : బాబ్జీ , నటించిన సినిమాలు (filmography ): 'భక్త మార్కండేయ'లో మార్కండేయుడిగా (1956), 'మాయాబజార్...