Posts

Showing posts with the label Anandh.G(singer)

ఆనంద్ - జి ,Anandh.G(singer)

Image
Sri.G.Anand, signing an autograph for Sahithya పరిచయం : పండంటి కా పురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురి ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . శిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : ఆనంద్ , గేదెల ( జి ), సొంత ఊరు : తులగాం గ్రామము - హిరమండలం దరి ., శ్రీకాకుళం జిల్లా . తండ్రి : స్టేజీ డ్రామా ఆర్టిస్ట్ , సోదరుడు : బాలరాజు (మాస్టారు) రాగోలు (ఆర్.టి.సి.కాలనీ-శ్రీకాకుళం జిల్లా ), భార్య : సుజాజ (డబ్బింగ్ ఆర్టిస్ట్ ), పిల్లలు : ఒక కుమారుడు - అమెరికాలో సెటిల్ అయ్యారు . ఎలా గాయకుడయ్యారు : నాన్న గారు చేసే వీధి డ్రామాలలో ఆనంద్ , ఆనంద సోదరుడు (అన్న ) ఇద్దరు పాల్గొనే్వారు . ముఖ్యము గా లవకుశ వేసాలు వేసేటపుడు బాగా పాడేవారు . అలా నాన్న వద్దనే సంగీత ఓనామాలు నేర్చుకున్నారు . ఎన్నో ఉస్తవాలలోను , పండగ సమయాలలోను , కొన్ని ఫంక్షన్లలోను పాటలు పాడేవారు . ...