Posts

Showing posts with the label Malladi RamaKrishnaSastry(మల్లాది రామకృష్ణశాస్ర్తి)

మల్లాది రామకృష్ణశాస్ర్తి,Malladi RamaKrishnaSastry

Image
పరిచయం (Introduction) : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... పానగల్ పార్కులో మహాబోధి మల్లాది--(17/6/1905-12/9/1965). కొంతకాలం ‘దేశాభిమాని’ పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేసిన మల్లాది రామకృష్ణశాస్ర్తి బహుభాషా కోవిదులు. నలభయ్యో పడిలో మద్రాసులో అడుగుపెట్టిన మల్లాది పగలంతా పానగల్ పార్కులో కూర్చొని వర్ధమాన సినీకవులకు సలహాలు ఇచ్చేవారు. చిత్రరంగంలో 40ల దశకంలో అజ్ఞాత రచయితగా ఉన్న ఈయన ‘చిన్న కోడలు (1952)’తో ప్రత్యక్ష సినీజీవితాన్ని ప్రారంభించి, సుమారు 200 పాటలు రాశారు. సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగల సౌరభం, మకరందం మాధుర్యం కలబోసిన ‘జాను తెనుగు’ ఆయన ప్రత్యేకత. రహస్యం, చిరంజీవుల...