Jandhyala Gowrinadha sastri-జంధ్యాల గౌరీనాథశాస్త్రి.
courtesy with : Ravi kondalarao@patabangaram of Eenadu cinema news paper. పరిచయం (Introduction) : జంధ్యాల గౌరీనాథశాస్త్రి..పాత తరము సినిమా నటుడు , దర్శకుడు ,సినీ నిర్మాత . ఈయన మొదటిగా 1943 సం.లో " భక్తపోతన " సినిమాలో శ్రీనాధుడు పాత్రను వేసారు. శ్రీనాథుడి పాత్ర ప్రతివారినీ ఆకట్టుకుంది. '' శ్రీనాథుడుడంటే ఇలానే ఉండేవాడు కాబోలు ముమ్మూర్తులా!'' అని సాహితీవేత్తలు కూడా భావించి శ్లాఘించారు. ఆయనకు సంగీతం వచ్చు. హిందూస్థానీ సంగీతమూ తెలుసు. జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట పుట్టినారు. జీవిత విశేషాలు (profile) : పేరు : జంధ్యాల గౌరీనాథశాస్త్రి, పుట్టిన తేదీ : *-*-1904, పుట్టిన ఊరు : పిడమర్రు గ్రామము -తెనాలి తాలూకా, మరణము : *-*-1958, నటించిన సినిమాలు (filmography ): " భక్తపోతన "(1943)- సినిమాలో శ్రీనాధుడు పాత్రను , భీష్మ (1944), 'మయామచ్ఛీంద్ర' (1945) మచ్ఛీంద్రుడి పాత్రను , 'భీష్మ' (1944)లో గౌరీనాథశాస్త్రి భీష్ముడు. 'ఒక రోజు రాజు' అనే జానపదం (1944) , 'రామాంజనేయ యుద్ధం' ఆంజనేయుడు పాత్రని, ...