Savitri (actress),సావిత్రి
----------------------------- పరిచయం : తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి . దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి,అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటిఅనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ప్రొఫైల్ : పేరు : కొమ్మారెడ్డి సావిత్రి . జన్మ నామము : సావిత్రి నిశంకర , పుట్టిన ఊరు : చిర్రావూరు గ్రామము, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం. పుట్టిన తేది : 1937 డిసెంబర్ 6 న, మరణించిన తేది : 1981 డిసెంబర్ 26 న చెన్నై లో మరణించింది. తండ్రీ : కొమ్మారెడ్డి గురవయ్య, తల్లి : సుభద్రమ్మ. చదువు : తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వలన మామ? యొక్క సహాయముతో విజయవాడ లోనికస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రిదగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడ...