Parineeti Chopra-పరిణీతి చోప్రా
పరిచయం (Introduction) : రానా సరసన పరిణీతి చోప్రా? పరిణీతి చోప్రా.. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న హాట్‌గాళ్ .... ప్రియాంకచోప్రా కజిన్‌గా పరిశ్రమకి పరిచయమైనా తనదైన మార్కుతో దూసుకుపోతోంది. 'లేడీ వర్సెస్ రికీ భల్' చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ భామ. ..శుద్ దేశీ రొమాన్స్ విజయం సాధించడంలో ఈ అమ్మడి ట్యాలెంటు ఎక్కువ ఉపయోగపడింది. అందుకే ఆ తర్వాత వరుసగా దర్శక-నిర్మాతలు వెంటపడుతున్నారు. వీలుంటే ఓ తెలుగు సినిమా చేయడానికి కూడా ఈ అమ్మడు సిద్ధమేనని చెప్పింది. సరైన స్క్రిప్టు నా వద్దకు వస్తే నటించడానికి రెడీ అని పలుమార్లు చెప్పింది. అయితే ఆ టైమ్ ఇప్పుడు రానే వచ్చిందని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానా హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూరి ఓ సినిమా తెరకెక్కించనున్నారని అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక కోసం వెతుకుతున్నారిప్పుడు. తొలుత శృతిహాసన్ నటిస్తుందని ప్రచారమైంది. శృతిహాసన్ తెలుగు, తమిళ్, హిందీ మూడు చోట్లా తెలుసు కాబట్టి మూడు పరిశ్రమల్లో బిజినెస్ పూర్తవుతుందని భావించి ఎంపిక చేయాలనుకున్నారు. అయితే లేటెస్టుగా ఆ ఛాన్స్ పరిణీ...