Posts

Showing posts with the label సూర్యకుమారి టంగుటూరి

సూర్యకుమారి టంగుటూరి ,Tanguturi Suryakumari

Image
పరిచయం : టంగుటూరి సూర్యకుమారి (Tanguturi Suryakumari) అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925 లో రాజమండ్రిలో జన్మించినది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937 లో మద్రాసు వచ్చి సినీరంగ ప్రవేశము చేసినది. 1952 లో ఆమె తొలి మిస్ మద్రాసు అయినది. తెలుగు , తమిళము, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు'స్వప్నజగతిలో ఛాయావీణ' మొదలైన లలిత గీతాలు, అడివి బాపిరాజు గారి 'ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ'...