Posts

Showing posts with the label సంగీతా ఘోష్

సంగీతా ఘోష్ , Sangeeta Ghosh

Image
------------------------------------------------------ పరిచయం (introduction) : సంగీతా ఘోష్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మన తెలుగువాళ్లలో ఎక్కువమంది ఈ పేరు విని వుండకపోవచ్చు. కానీ టీవీలో హిందీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకి ఆ పేరు సుపరిచితం. పలు టీవీ సీరియళ్ల ద్వారా టీవీ తారగా పాపులర్ అయిన సంగీత డ్యాన్స్ ప్రోగ్రామ్ ’నాచ్ బలియే’ ద్వారా మరింత ఖ్యాతి సంపాదించుకుంది. ’దేశ్ మే నిక్లా హోగీ చాంద్’ సీరియల్ ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. అందమైన టీవీ తారగా అనతికాలంలోనే పాపులర్ అయ్యింది. ఇప్పుడామె తెలుగు సినిమాకి పరిచయమవుతోంది. స్వీయ నిర్మాణంలో దర్శకుడు విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న ’రెయిన్‌బో’ సినిమాలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో ఆమె ఒక సినీ తారగా కనిపిస్తుంది. ఇటీవల ఆమెపై బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ’బాటిల్స్ అండ్ చిమ్నీస్’ బార్‌లో ’సల సల సల కాగే ఒళ్లు.. మిల మిల మిల మెరిసే కళ్లు..’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ పాటలో కురుచ దుస్తుల్లో సంగీత వంటి ఒంపుసొంపులు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. సాహితి రాసిన ఈ పాటకు నిహాల్ సంగీతం సమకూర్చాడు. సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ సమకూర్చి...