అల్లు అర్జున్
పరిచయం : అల్లు అర్జున్ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు. అలాగే ఇతడు సుప్రసిద్ద నటుడు పద్మభూషణ్ చిరంజీవి గారికి మేనల్లుడు. చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్ కు, అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డి తో నిశ్చయమైనది అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.అల్లు అర్జున్ ఫాషన్ మరియు స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు profile : జన్మ నామం : అల్లు అర్జున్, పుట్టిన తేదీ : ఏప్రిల్ 8 -1983, ఇతర పేరు : బన్ని, ప్రముఖ పాత్రలు : ఆర్య, బన్ని, నాన్న : అల్లు అరవింద్ , అమ్మ : తోబ...