Posts

Showing posts with the label MohanbabuManchu

మోహన్ బాబు మంచు ,MohanbabuManchu

Image
మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) - (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో పుట్టిన మంచు భక్తవత్సలం నాయుడు సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శక రత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. రంగంపేట లో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.