Posts

Showing posts with the label Jhansi(anchor)-ఝాన్సీ

ఝాన్సీ , Jhansi(anchor)

Image
--   పరిచయం : ఝాన్సీ చిన్న వయసు లోనే బుల్లితెర నటి గా జీవితాన్ని ప్రారంభించి .. తరువాత యాంకర్ గా బుల్లితెర పై ఎన్నోప్రయోగాలతో అలరించి , అనంతరం కేరక్టర్ నటిగా మారింది .ఝాన్సీ... టీవీ చూసే వాళ్లకి ఆమెను పరిచయం చేయక్కర్లేదు. పద్దెనిమిదేళ్ల నుంచి ప్రేక్షకులకి సుపరిచితురాలు. ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమంతో తనదైన శైలిలో అలరిస్తోంది. మన రాష్ట్రంలోని అన్ని యాసల్లో మాట్లాడి, హావభావాలతో సహా అనుకరించే అమ్మాయి ఝాన్సీ . ప్రొఫైల్ : పేరు : ఝాన్సీ , అమ్మ పేరు : శారద అల్ ఇండియా రేడియో లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రిటైరయ్యారు . నాన్న : ఎలక్ట్రికల్ కంట్రాక్టర్ . పుట్టిన ఊరు : విజయవాడ ( అమ్మ వాళ్ల ఊరు) పెరిగిన ఊరు : హైదరాబాద్ , చదువు : బి.ఎ. భర్త : జోగి నాయుడు , పిల్లలు : ఒక కూతురు - ధన్య. ఇష్టమైన హీరోలు : నాగార్జున , జగపతి బాబు , రాజేంద్రప్రసాద్ , ఇష్టమైన హీరోయిన్స్: సౌందర్య ,ఛార్మి , కెరీర్ : తన మాటల్లో ->  నేను పదిహేడో ఏటనే ఈ రంగంలోకి వచ్చానని చాలామందికి తెలియదు. మాది విజయవాడ. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. అమ్మ శారద ఆలిండియా రేడియాలో పన...