P. J. Sharma - పీజే శర్మ
పరిచయం (Introduction) : పూడిపెద్ది జోగీశ్వర శర్మ (పి.జె.శర్మ)ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. వీరి కుమారుడే ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు మరియు కథానాయకుడు సాయికుమార్. వీరు చిన్నతనం నుండే నాటకరంగం పై మక్కువ పెంచుకొని పేదరైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులంలేని పిల్ల, ఋష్యశృంగ, నవప్రపంచం మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలను పోషించారు. వీరు 1954లో మొదటిసారిగా అన్నదాత సినిమాలో చిన్న వేషంలో కనిపించారు. 1957లో విజయనగరం రాఘవ నాటక కళాపరిషత్ పోటీలలో పాల్గొని సినీ ప్రముఖుల ఆహ్వానం మీద మద్రాసు చేరుకున్నారు. ఆరుద్ర మరియు శ్రీశ్రీ ల ప్రోత్సాహంతో తొలిసారిగా ఉత్తమ ఇల్లాలు (1957) చిత్రంలో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ కుమార్ ప్రేమనజీర్ ధరించిన ఎన్నో పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఒక వైపు డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూనే కొన్ని వందల చిత్రాలలో నటించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : పూడిపెద్ది జోగీశ్వర శర్మ (పి.జె.శర్మ), పుట్టిన ఊరు : విజ...