జాలాది రాజారావు , Jaladi Raja rao
image : courtesy - Wikipedia.org పరిచయం (Introduction) : జాలాది గా ప్రసిద్ధులైన జాలాది రాజారావు (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. వీరు 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించారు.జానపదాల జాలాది గేయకవి వీరఘట్టంలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా విధులు .. జానపదాల జావళి, పల్లె పదాల పాటగాడు సినీగేయ రచయిత జాలాది రాజారావుకు సిక్కోలుతో ఉన్న బంధం విడదీయలేనిది. సినీకవిగా ప్రపంచానికి పరిచయం అయ్యే ముందు ఆయన చిత్రలేఖన ఉపాధ్యాయుడిలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయన జిల్లాను సందర్శించారు. జీవిత విశేషాలు (profile) : జన్మనామం : జాలాది రాజారావు, జననం : ఆగస్టు 09, 1932, మరణం :14-అక్టోబర్ -2011 (విశాఖపట్నం లోని తన స్వగృహంలో అస్వస్థతతో మరణించారు-వయసు:79), సంగీత రీతి : రచయిత, వృత్తి : గీత రచయిత, వాయిద్యం : రచయిత, కవి, సినిమాలు (filmography ): సినిమా పాటలు(cine songs) కొన్ని -- * పల్లెసీమ (1977) - సూరట్టుకు జారతాదీ సిటుక్కు సిటుక్కు వానచుక్కా, * దేవుడే గెలిచాడు - ఈ కాలం పది కాలాలు బతకాలనీ, * ప్రాణం ఖరీదు (1978) - యాతమేసి తోడినా ఏరు ఎండదు .. ...