ఆత్రేయ , Atreya
పరిచయన్ : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... ఆచార్య ఆత్రేయ (Acharya Atreya).. ఆచార్య ఆత్రేయ (Acharya Atreya) గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు , తెలుగులో సుప్రసిద్ధ నాటక , సినీ రచయిత, నిర్మాత మరియు దర్శకులు. నాటక కర్తగా, ప్రయోక్తగా పేరుపొందిన ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. ‘దీక్ష’(1951)తో సినీరంగంలో ప్రవేశించారు. అర్ధాంగి, తోడికోడళ్లు వంటి చిత్రాలకు మాటలు, పాటలు రాసి స్థిరపడ్డారు. ‘మనసులు’తో అంతమయ్యే పేర్లుగల చిత్రాలకు, కొన్ని ఇతర చిత్రాలకు మనసు పాటలు రాసి ‘మనసు కవి’గా గుర్తింపు పొందారు.తేలికైన పదాలలో బరువైన భావాన్న...