వేటూరి సుందరరామ్మూర్తి , VeturiSundararamamurty
================================= పరిచయం : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...వేటూరి సుందరరామ్మూర్తి. వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జ. 29-Jan.1936) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరిజంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు దగ్గర శిష్యరికం చేసారు. తొలినాళ్ళలో పాత్రికేయినిగాపనిచేసిన వేటూరి , కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. తర్వాత కొన్నివేల పాటలను రాసారు. మహానటుడు నందమూరి తారక రామారా...