విజయనిర్మల , Vijayanirmala
- - - - - - - పరిచయం : 8 సం .వయసులోనే బాల నటి గా "మత్య రేఖ" ,"మనం పోల్ మాంగల్యం " అనే తమిళ్ సినిమాల లో నటించారు- విజయనిర్మల . తెలుగు సినిమా నటి , దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య . నటి అయిన ఈమె 1971 లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది . ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం . వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు . ప్రొఫైల్ : ఈమె అసలు పేరు : నిర్మల సినిమా రంగం లో పేరు : విజయనిర్మల( అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. బర్త్ డే : 20th ఫిబ్రవరి-1944 పుట్టిన ఊరు : మద్రాస్ , నాన్న : యస్ .రామమోహన్ ,-వాహిని స్టూడియో లో సౌండ్ ఇంజినీర్ , అమ్మ :శకుంతల దేవి , తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఒక అన్నయ్య , పిల్లలు : మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. తెలుగు లో మొదటి సినిమ...