రాజ్-వెంకటసోమరాజు,Raj-Venkatasomaraju
పరిచయం : రాజ్ - అంటే ... తోటకూర వెంకటసోమరాజు మంచి సంగీత దర్శకుడు . ఈయన సుప్ర సిద్ద సంగీత దర్శకుడు టి . వి . రాజు తనయుడు , సాలూరు రాజేశ్వరరావు , చక్రవర్తి అనే ఇద్దరు సంగీత సామ్రాట్ ల ప్రియ శిష్యుడు , రాజ్ - కోటి కాంబినేషన్ లో మంచి సంగీతాన్నీ అందించారు . ప్రొఫైల్ : పేరు : రాజ్ , పూర్తి పేరు : తోటకూర వెంకతసోమరాజు , స్వస్థలం : రఘుదేవపురం - రాజమండ్రి దగ్గర , పుట్టిన స్థలం : చెన్నై ' పుట్టిన తేది : 27 జూలై 1957 , నాన్న పేరు : తోటకూర వెంకటరాజు , సంగీత దర్శకుడు 50 సం . వయసు లోనే ( 20 ఫిబ్రవరి 1973 ) చనిపోయారు . అమ్మ పేరు : సావిత్రి . అన్నయ్య : సూర్యనారాయణ రాజు , చదువు : ఇంటర్మీడియట్ -- , పియానో , వైయిలేన్ , కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు , కెరీర్ : నాన్న గారు చనిపోయిన తరువాత కొన్నాళ్ళు సాలూరు హనుమంతరావు ( సాలూరి రాజేశ్వరరావు గారి అన్నయ్య ) దగ్గర , కొన్నాళ్ళు యస్ . పి . కోదండ పాణి దగ్గర తరువాత సాలూరి రాజేశ్వరరావు దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా పనిచేసారు . కొన్నాళ్ళు మలయాళీ సంగీత దర్...