బాలచందర్-కె ,Balachandar K
పరిచయం : బాలచందర్-కె - తెలుగు సినిమా దర్శకుడు , స్క్రిప్ట్ రైటర్ & ప్రొడ్యూసర్ . బాలచందర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి పిల్లగాలులను మోసుకొచ్చిన వాయుదేవుడు. హిందీ సినిమాలు కనీసం కల గనడానికికూడా భయపడే సాహసోపేతమెన ఇతివృత్తాల్నిపరమసహజంగా డీల్ చేసిన దర్శకుడాయన. బహుశా తెలుగులో ఆయన తొలిచిత్రం ''భలేకోడళ్ళు'' లేదా ''బొమ్మా బొరుసా''అనుకుంటా. తర్వాతతర్వాత మాస్ హీరోలైన కృష్ణ, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తదితరులును పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. ఇక అంతులేనికథ, మరోచరిత్ర, ఇదికథకాదు, 47 రోజులు లాంటి సినిమాలలో బాలచందర్ పోర్ట్రే చేసిన పాత్రల గురించిచెప్పవలసిన పనేలేదు. మానవ సంబంధాలు ఇతివృత్తంగా తమిళంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. అవన్నీబాలచందర్, ఆయన శిష్య, ప్రశిష్యకోటి తీసినవే అయివుండడం కేవలం యాదృచ్ఛికం కాదు. బాలచందర్ స్కూల్ అంటే అదేమరి! ప్రొఫైల్ : పేరు : కైలాసం బాలచందర్ , పుట్టిన తేది : ~09 -జూలై ~1930 , పుట్టిన ఊరు : నన్నిలం , తంజావూరు జిల్లా , తమిళనాడు . నాన్న : దండపాణి కైలాసం , అమ్మ : సరస్వతి , మతము : హిందూ .. ...