Posts

Showing posts with the label Smitha Madhav - స్మితామాధవ్‌ (బాలరామాయణం-సీత)

Smitha Madhav - స్మితామాధవ్‌ (బాలరామాయణం-సీత)

Image
    పరిచయం (Introduction) : దేవుడు నాకు నాట్యకళని ఇచ్చాడు. ఆ కళే నన్ను సీతని చేసింది. బాలరామాయణంలో సీత పాత్ర కోసం హైదరాబాద్‌లో ఉన్న అన్ని పాఠశాలల్లోని అమ్మాయిలనూ జల్లెడపడుతుంటే, ఆ అవకాశం నాకు దక్కడమేంటీ.. అందులోనూ కేవలం ఫొటో చూసి! ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దైవత్వం ఉట్టిపడే ఆ పాత్రని నేను చేశా అని గర్వంగా ఉంటుంది. బాలరామాయణంలో సీతగా చేసినప్పుడు నేను హైదరాబాద్‌లోని నాజర్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నా. అప్పటికే ఆ సినిమాలోని అన్ని పాత్రలకీ కావాల్సిన పిల్లల్ని ఎంపికచేసి, సీత కోసం వెతుకుతున్నారు. నేను చిన్నప్పట్నుంచీ భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నా. సరిగ్గా అప్పుడే అరంగేట్రం చేశా. ఆ ఫొటోలు అన్ని పేపర్లలో వచ్చాయి. వాటిని చూసిన ఎమ్మెస్‌ రెడ్డిగారు మా చిరునామా తెలుసుకుని ఇంటికొచ్చారు. మా ఇంట్లో సినిమాలు చూసే వాళ్లు చాలా తక్కువ. అలాంటిది ఏకంగా నటించడమనగానే మా తాతయ్య వాళ్లు ఒకపట్టాన ఒప్పుకోలేదు. ఎమ్మెస్‌ రెడ్డిగారు 'ఇది కమర్షియల్‌ సినిమా కాదు, దేవుడి సినిమా, అదీ సీత పాత్ర కోసం' అంటూ ఒప్పించారు. ఆరోతరగతి సెలవుల్లో సినిమా మొదలైంది. విడుదలయ్యే సమయానికి నేను ఎనిమిదో తరగత...