వాణీ విశ్వనాథ్ , Vaniviswanadh
--------------------------------------- పరిచయం : వాణీ విశ్వనాథ్ త్రిశ్శూరు కు చెందిన మళయాల సినిమా నటి . ఈమె తెలుగు , తమిళ సినిమాలలో కూడా నటించినది . వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో పి . జి . విశ్వాంభరన్ దర్శకత్వములో ఒక సినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించినది . భర్త -----: వాణీ విశ్వనాథ్ ప్రతినాయక పాత్రలు పోషించే బాబురాజ్ ను పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడినది . పిల్లలు --: ఈమెకు చెన్నై లో ఒక పాప పుట్టింది . కేరళ జానపద గాథలలో వీరవనిత అయిన ఉన్ని అర్చ పేరు మీదుగా అర్చ అని నామకరణము చేశారు . వాణీ విశ్వనాధ్ నటించిన తెలుగు చిత్రాలు * సింహస్వప్నం * రౌడీయిజం నశించాలి * కొదమసింహం * చిన్నల్లుడు * దొంగల్లుడు * అలెక్జాండర్ * చిన్న కోడలు * వదినగారి గాజులు * సామ్రాట్ అశోక్ * ఘరానా మొగుడు * ప్రేమ చిత్రం - పెళ్లి విచిత్రం * మామ - కోడలు * లేడీస్ స్పెషల్ * జోకర్ * ప్రేమ అండ్ కో * రైతు భారతం * యాగం * ముద్దు