Posts

Showing posts with the label కల్పన రాఘవేంద్రరావు (singer cum actress)

Kalpana Raghavendrarao, కల్పన రాఘవేంద్రరావు (singer cum actress)

Image
    పరిచయం (Introduction) :      కల్పన... 'ముసుగు వేయొద్దు మనసు మీదా' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన గాయని. ఆమె ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా పాడతారు. ఆమెలో అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. సమస్యలకు జడిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్న పిరికితనం, అదే సమస్యపై పోరాడి విజేతగా నిలిచిన మొండితనం. సంగీతం, నాట్యం, చదువూ, బహుభాషా ప్రావీణ్యం... ఇలా సకల కళల కలబోత కల్పన తన ప్రస్థానం గురించి వివరిస్తున్నారిలా.... 'పాట ఏదైనా సరే దాని అర్థం, ఉచ్ఛారణ తెలీకుండా పాడితే అది అర్థరహితంగా ఉంటుంది' ఇది మా నాన్న నాకు చెప్పిన మాట. తమిళమ్మాయినైనా ఇప్పుడు మీతో ఇంత చక్కగా తెలుగు మాట్లాడటానికి కారణం ఆ మాటే. నాకు తెలుగు రాయడమూ, చదవడమూ వచ్చు. మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌, ఇటాలియన్‌, జర్మనీ, అరబిక్‌ భాషలూ వచ్చు. ఇన్ని భాషలు నేర్చుకోవడానికి కారణం సంగీతమే. ఏ భాషలోనైనా పాట అర్థం తెలీకుండా నేను పాడలేను. అదే నేను ఇన్ని భాషలు నేర్చుకునేలా చేసింది. నిజానికి నా ప్రస్థానం ప్రారంభమైంది గాయనిగా కాదు నటిగా. మూడన్నరేళ్ల వయసులోనే సినిమాల్లో నటించాను. మలయాళంలో 'ఈనాడు' నా తొలిసినిమా. ఐదేళ్లు...