Posts

Showing posts with the label Raju T.V(music dir)

Raju T.V , టి.వి.రాజు

Image
-- T.V.Raju పరిచయం (Introduction) : టి.వి. రాజు మ్యూజిక్ కంపోజర్ , సంగీత దర్శకుడు , యాక్టర్ . ప్రశాంతంగా ప్రవహిస్తున్న సెలయేటి మీద, చిరు పడవ పిల్ల గాలితోపాటు కదిలి వెళ్తూవుంటే ఎంత మనోల్లాసంగా ఉంటుందో, అలా ఉంటుంది టి.వి.రాజు గారి సరళ సంగీతం. రాజుగారి తండ్రిగారు సోమరాజుగారు సంగీతజ్ఞులు కాదుగాని సంగీత ప్రియులు. రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం వారి స్వస్థలం. రాజుగారు పుట్టిన కొద్దికాలానికే తండ్రిగారు పోవడంతో, ఆయన్ని అదుపాజ్ఞల్లో పెట్టగలిగే వ్యక్తిలేక, జీవితం దారం తెగిన గాలిపటం అయిపోయింది. చదువు సాగలేదు. నాలుగోఫారం మెట్టు ఎక్కడమే గగనమైపోయింది. కాని, సంగీతం అంటే అభిమానం, ప్రేమా ఉండడం చేత స్వగ్రామంలో ఉన్న నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యుల దగ్గర మూడేళ్లు స్వరాభ్యాసం చేశారు. ఒక పక్క అభ్యాసం చేస్తూనే పిల్లలకి పాఠాలు కూడా చెప్పేవారు. వాళ్లకి సంగీత పాఠాలు నేర్పుతూనే తాను 'జీవిత పాఠాలు' నేర్చుకున్నారు. అలా నాలుగేళ్లు గడిచింది. పాట, పద్యం బాగా పాడగలుగుతున్నాడని ఆ అబ్బాయి చేత నాటకాల వాళ్లు వేషాలు వేయించారు. 1934లో లోహితాస్యుడు వేషంతో రంగస్థలానుభవం ఆరంభమైంది. నిదానంగా కనకసేనుడు, నారదుడు, ...