కాంచనమాల చిత్తజల్లు-Kanchanamala
-------------------------------------------------------------- పరిచయం : అలనాటి అందాల తెలుగు సినిమా తార, తెలుగు సినిమా హీరోయిన్లకి గ్లామర్ సృష్టించిన తొలి తెలుగు సినీ నటి మరియుగాయని చిత్తజల్లు కాంచనమాల . 1938 - 40 ప్రాంతాల చాలా మంది ఇళ్లలో గోడ మీద కాంచనమాల కాలెండర్వేల్లాడుతూ వుండేది. సంవత్సరం అయిపోయి, డేట్ కాలెండర్ చిరిగిపోయినా, ఆ చిత్రం మాత్రం కొంత మంది ఇళ్లలోకనిపించేది. ఆ కాలెండర్ బొమ్మ ‘మాలపిల్ల’ (38) చిత్రంలోది. ఆ మాలపిల్ల పాత్రధారిణి ఆమె. మొదట్లో పల్లెటూరివాళకంగా వున్నా, ఒక బ్రాహ్మణయువకుని వివాహం చేసుకుని కలకత్తా పారిపోయి, సంస్కారవంతురాలైన తర్వాతతీసిన స్టిల్ అది. అదే కాలెండర్. జీవిత విసేసాలు : జన్మ నామం - చిత్తజల్లు కాంచనమాల జననం - 5-మార్చి-1917, పుట్టిన ఊరు : తెనాలి, మరణం - 24-జనవరి-1981 వృత్తి నటి సినీ జీవితం కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారము (35) లో మిత్రవింద వేషం వేయించారు. ‘మాలపిల్ల, గృహలక్ష్మి’ (38) చిత్రాలతో ఆమె ప్రేక్షక హృదయాల్లో తన ‘అందం’...