రాకుల్ ప్రీత్ సింగ్ , Rakul preeth singh
పరిచయం (Introduction) : అనేక ప్రధాన బ్రాండ్లకు ముద్రణామాధ్యమం లో ఎన్నో వాణిజ్యప్రకటలను చేసిన రాకుల్ ప్రీత్ సింగ్ ను చూడగానే ముఖం సుపరిచితం గానే ఉన్నట్లు అనిపిస్తుంది . మోడలింగ్ నుంచి వెండి తెరకు పరిచయమైన ఢిల్లీ భామ రకూల్ ప్రీత్‌సింగ్. రెబల్‌స్టార్ కుటుంబం నుంచి వచ్చిన యువహీరో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన ‘కెరటం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమ కు పరిచయమైంది ఈ సుందరి. సినిమా ద్వితీయార్థంలో వచ్చే పాత్ర అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది . ప్రస్తుతం తన తొలి సిని మా ‘కెరటం’ తమిళ్, మలయాళంలోకి కూడా అనువాద మవు తోంది. అక్కడ రిలీజ్‌లతో ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశముంది. ఇప్పటికే ఓ దక్షిణాది సినిమాకి సంతకం చేసిందని సమాచారం. ‘కెరటం’ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్ సోదరుడు గౌతమ్ పట్నాయక్ దర్శకుడు. ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. వి.బాబు నిర్మించారు. టీనేజి యువతను ఆక ట్టుకునే కథాంశంతో రూపొందిన చిత్రమిది. జీవిత విశేషాలు (profile) : పేరు : రాకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh, జన్మస్థలము : న్యూడిల్లీ , పుట్టిన తేదీ : 10- Octo - 1990, చదువు : బి.ఎ. హానర్స్...