Posts

Showing posts with the label SanaKhan-సనాఖాన్

సనా ఖాన్ , Sana Khan

Image
  పరిచయం (Introduction) : ముంబయ్ భామలను ఒక విధంగా ముందుగా గుర్తించి, ఆదుకునేది సౌత్ సినిమానే. టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ ముందుగా వీళ్ళని వెండితెర కెక్కిస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ అదృష్టం. ఇలా ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద స్టార్లయిన అమ్మాయిలు చాలా మందే వున్నారు. ఇప్పుడలా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో ముంబయ్ ముద్దుగుమ్మ సనా ఖాన్. ఇటీవల వచ్చిన కల్యాణ్ రామ్ చిత్రం 'కత్తి' ద్వారా తను తెలుగు తెరకు పరిచయమైంది. జీవిత విశేషాలు (profile) : పేరు : సనా ఖాన్‌ , పుట్తిన ఊరు : ముంబై , పుట్టిన తేదీ : 30 సెప్టెంబర్ 1981 , చదువు : ప్లస్ టు . తండ్రి : మలయాళీ ముస్లిం - కేరళ లో కన్నూర్ ప్రాంతము , తల్లి : సఈదా - మంబై నుండి . ఇస్టమైన తారలు : బాలీవుడ్ తారలు షారూఖ్, సల్మాన్ లన్నా, మాధురి, కాజోల్ లన్నా తనకి ఎంతో ఇష్టమట. కెరీర్ : సనా పుట్టింది, పెరిగింది ముంబయ్ లోనే. తను ప్లస్ టూ చదువుతుండగానే మోడెలింగ్ చేసే అవకాశం వచ్చింది. అలా ఒకటీ అరా కాదు, ఏకంగా 70 యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. విశేషమేమిటంటే, షారూఖ్, అక్షయ్ లాంటి స్టార్స్ తో కూడా చేసింది. అలా చేస్తున్నప్పుడే తమిళంలో ఛాన...