ఛార్మి,charmi Kaur
=============================================================== పరిచయం : ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబాయి లో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి "నీ తోడు కావాలి" తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే "కాదల్ కిసు కిసు " అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై , ఆహా, ఎత్న అళగు - తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె ప్రముఖ తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన "శ్రీ ఆంజనేయం" చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన "నీకే మనసిచ్చాను" కూడా ప...