ఆదుర్తి సుబ్బారావు,AdurthiSubbarao
పరిచయం : ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు. ఆదుర్తి సుబ్బారావు గారు ముందు ఫిల్ము ఎడిటరు. తర్వాతే దర్శకుడయ్యారు. అయితే, ఈ ఎడిటరు ఒక్క ఫిల్ము ఎడిటరే కాదు- పత్రికకి కూడా ఎడిటరన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. 'హారతి' అనే పత్రికకి ఆయన ఎడిటరుగా పని చేశారు- సినిమాలకి రాక ముందు. ఆయనకి ఇంకో విశేషం కూడా ఉంది. 1946లో వచ్చిన 'వనరాణి'లో ఆయన రెండు పాటలు రాశారు. ఇందులో జి.వరలక్ష్మి ప్రధాన పాత్రధారిణి. ప్రొఫైల్ : పేరు : సుబ్బారావు ఆదుర్తి , పుట్టిన తేది : 16 డిసెంబరు 1922 , మరణము : 01 అక్టోబర్ 1975 , పుట్టిన ఊరు : రాజమండ్రిలో , తండ్రి : సత్యనారాయణ -తాసీల్దారు (సత్తెన్న) , చదువు : ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. కెరీర్ : ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతనిసోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు. తరువాత ఇతడు ...