N.Sankar-ఎన్.శంకర్(film director)
పరిచయం నల్గొండ జిల్లా చిరుమర్తి గ్రామానికి చెందిన ఎన్.శంకర్ ‘ఎన్‌కౌంటర్’ చిత్రంతో 1997లో దర్శకుడిగా సినీ పరిక్షిశమలోకి అడుగుపెట్టారు. సామాజిక సందేశంతో పాటు అభ్యుదయ భావాల్ని తన చిత్రాల ద్వారా తెలియజెప్పిన ఎన్. శంకర్ తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారు. చిత్రాలు దర్శకునిగా ఆయనకు చక్కటి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆయన నిర్మించిన ‘జై బోలో తెలంగాణ’ యావత్ తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగించింది. గోవాలో జరిగిన దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో కూడా ఈ చిత్రం ప్రదర్శింపబడింది. హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కార వేడుకలకు భారతీయ సినిమాలు ప్రతిపాదించేందుకు ఏటా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. మొత్తం 17 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు నుంచి ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఈ యేడు ఎంపికయ్యారు. ఆస్కార్ పురస్కారాల్లో విదేశీ భాషా విభాగానికి మన దేశం నుంచి పంపాల్సిన సినిమాల్ని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ప్రక్రియలో ఎన్.శంకర్ పాల్గొంటారు. ఈయన గతంలో నంది పురస్కార కమిటీ సభ్య...