Thaman music director, తమన్ సంగీత దర్శకుడు
పరిచయం (Introduction) : స్వరాలతో 'కిక్' ఎక్కించి యువతరాన్ని ఆకట్టుకొంటున్న సంగీత దర్శకుడు తమన్. మాస్, బీట్, మెలోడీ ఇలా... అన్ని రకాల బాణీల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ ఏడాది అగ్ర కథానాయకుల సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు ఎవరంటే తమన్ పేరే వినిపిస్తుంది. 'బృందావనం', 'రగడ', 'మిరపకాయ్'... ఇలా ఆయన స్వర ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. మహేష్‌బాబు కొత్త సినిమా 'దూకుడు'కీ ఆయనే స్వరాలు సమకూరుస్తున్నారు జీవిత విశేషాలు (profile) : పేరు : తమన్ , పూర్తి పేరు : సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ , పుట్టిన ఊరు : చెన్నై -- తమిళనాడు , తాత : ఘంటసాల బలరామయ్య (పాత కాలపు సినిమా దర్శకుడు ,నిర్మాత ), భార్య : శ్రీవర్ధిని -- నేపద్య గాయని (playback singer), పిల్లలు : ఒక కుమారుడు --అర్చిత్ , తోబుట్టువులు : ఒక చెల్లి , నాన్న : శివకుమార్ (మంచి డ్రమ్మర్)నాన్నది నెల్లూరు - తను 7 వ తరగతి చదువుతుండగా గుండెపోటుతో మరణించారు , అమ్మ : సావిత్రి (గాయని) అమ్మది గుంటూరు , కొన్ని సినిమాలు (filmography ): యాక్టర్ గా : 2003 -- బోయిస్ (boys)...