కన్నెగంటి బ్రహ్మానందం , Brahmanandam Kanneganti
పరిచయం : బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు . ఈయన అరగుండుగా , ఖాన్ దాదాగా , కత్తి రాందాసుగా , శంకర్ దాదా ఆర్ . ఎమ్ . పి . గా ... వెవిద్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు . ప్రొఫైల్ : పూర్తి పేరు : కన్నెగంటి బ్రహ్మానందం . తండ్రి : కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు : కన్నెగంటి లక్ష్మీనరసమ్మ . పుట్టిన తేది : ఫిబ్రవరి 1, 1956 పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల గ్రామంలో జన్మించారు . మతము : హిందూ - ఆచారి (కంసాలి) తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు . అప్పటికే ఆరుగురు పిలలకి జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు . కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి . తల్లి ప్రాణాలు దక్కినా బ్రహ్మానందం అనే పసవాడిపై మాత్రం అందరిదీ శీతకన్న చదువు- సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు . తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహతులెన సున్నం ఆంజనయులు ప్రోద్బలంతో భీమివరం డి . ఎన్ . ఆర్ . కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్ర...