Posts

Showing posts with the label డి.వి.యస్.రాజు

డి.వి.యస్.రాజు , Raju.D.V.S

Image
====================================================== పరిచయం : డి .వి.యస్.రాజు తెలుగు సినిమా నిర్మాత . 1988 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్ పొందేరు . చిత్ర ప్రపంచంలో ఆయనకు పెద్ద మనిషిగా ఎంతో గౌరవం. 'జెంటిల్మెన్‌' అన్న పదానికి పర్యాయపదంగా నిలిచారు డి.వి.ఎస్‌. రాజుగారు. బాధ్యత ఎరిగిన నిర్మాతగానే కాకుండా, సినీ పరిశ్రమ పచ్చగా వుండడానికీ, పరిశ్రమలోని అన్ని శాఖలూ ఐక్యతతో, ఇబ్బందులు పడకుండా వుండడానికీ ఎంతో కృషి చేశారు. ఎన్నో బరువైన బాధ్యతలు చేపట్టారు. 'ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా' అన్న సంస్థ 1965లో ఏర్పాటైంది. ఆ సంస్థ ఆవశ్యకతకు నడుంకట్టిన రాజుగారు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ముడి ఫిలిం, నిర్మాతలందరికీ సమానంగా అందాలన్న ఉద్దేశంతో ఆ సంస్థ ఆరంభమై ఆశయాన్ని సిద్ధింపజేసుకుంది. 1966లో ఆయన దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. గౌరవ చిహ్నంగా రాజుగారిని 'భీష్మ' అవార్డ్‌తో వాణిజ్యమండలి సత్కరించింది. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రాజుగారు చైర్‌మన్‌గా వ...