Posts

Showing posts with the label సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సీతారామశాస్త్రి , Sirivennela Sitarama Sastry

Image
పరిచయం : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... సీతారామశాస్త్రి. సిరివెన్నెలతో సినీరంగ ప్రవేశము చేసిన చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత . శిశిరంలో కోయిల సిరివెన్నెల--ఎనభైల దశకంలో తెలుగు సినిమా పాట అయోమయ స్థితిలో ఉండగా, శిశిరంలో కోయిలలా సీతారామశాస్ర్తి సినీరంగంలో ప్రవేశించారు. 20/5/1955న జన్మించిన చేంబోలు సీతారామశాస్ర్తి టెలిఫోన్స్‌లో పనిచేస్తూ ‘గంగావతరణం’ గేయం ద్వారా దర్శకుడు విశ్వనాథ్ దృష్టిలో పడి, ‘సిరివెన్నెల (1986)’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ 12 మంది ప్రతిభామూర్తుల్లో 10 నంది బహుమతులను కైవసం చేసుకొన్న సినీకవి.తాత్వికత, తార్కికత, భావుకతతో కూడిన అభివ్య...