రమాప్రభ,Ramaprabha
పరిచయం : రమాప్రభ (Ramaprabha) తెలుగు సినిమా నటి . చిత్తూరు జిల్లా , వాల్మీకిపురానికి ( దీని పాతపేరు వాయల్పాడు ) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది . హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో , ఎంతోమంది సరసన , ముఖ్యంగా అల్లు రామలింగయ్య , రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది . ప్రముఖ నటుడు శరత్ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది . నటుడు శరత్ బాబుతో విడిపోయిన రోజు తన జీవితంలో అత్యంత మధురమైన రోజు అని నిర్మొహమాటంగా చెపుతోన్న రమాప్రభ . అసలు పేరు-- రమాప్రభ ముద్దు పేరు--రమ్మి పుట్టిన తేదీ---మే ౫ పుట్టిన ఊరు : మదనపల్లి భర్త : శరత్ బాబు (నాలుగు సంవస్తరాలు రమాప్రభ కంటే చిన్న ) ఎత్తు -------5.0 చదువు ----- లేదు. చదువుకోలేదు తొలి చిత్రం---- చిలకా-గోరింక...1963లో ప్లస్ పాయింట్--మర్చిపోయేతనం మైనస్ పాయింట్ -అనుకున్నది చెప్పి ఇబ్బందిలో పడటం మీలో మీకు నచ్చేది-ప్రెండ్లీగా ఉండడం ఇతరులలో నచ్చేది--ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది చిన్ననాటి అనుభూతులు- ఎన్న...