Swarnalatha(Telugu singer)-స్వర్ణలత (తెలుగు గాయని)
Source : Eenadu cinema page --Pathabangaram by Raavi Kondalrao. పరిచయం (Introduction) : సినిమా పాటలు పాడే గాయనీ గాయకులు అన్ని రకాల, రసాల పాటలూ పాడతారు.. పాడగలరు. మధుర గాయకులు అనిపించుకున్నవారు కూడా హాస్యగీతాల్లాంటివి పాడారు. కానీ, ఒక్క స్వర్ణలతకి మాత్రం 'హాస్యగీతాల గాయని'గా ముద్రపడింది. చిన్నతనంలో ఎనిమిదేళ్లపాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుంది. నాట్యం కూడా అభ్యసించింది. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించింది. గాత్రకచేరీలు చేసింది. అయినా తొలిసారి సినిమా కోసం పాడిన పాట హాస్యనటుడితో పాడడం వల్ల కాబోలు అలా ముద్ర పడిందనిపిస్తుంది. ఆ సినిమా 'మాయా రంభ' (1950). ఆ పాట కస్తూరి శివరావుతో కలిసి పాడిన 'రాత్రీ పగలనక...'. ఆనాటి సినిమా కథా సంప్రదాయం ప్రకారం నాయికానాయకులతోపాటు హాస్యజంటకు కూడా పాటలుండేవి. పురాణ, జానపద, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఇలాంటి పాటలు వినిపిస్తాయి. చాలా పాటలు జనాదరణ పొందాయి ఒక్కసారి స్వర్ణలత పాటలు గుర్తుకు తెచ్చుకుంటే- 'కాశీకి పోయాను రామా హరీ', 'ఓ కొంటె బావగారూ' (అప్పుచేసి పప్పుకూడు: 1959), 'అంచెలంచెలు లేని మోక్షము' (...