Sankaramanchi Janaki-షావుకారు జానకి
పరిచయం (Introduction) : షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి , అలనాటి తెలుగు సినీ కథానాయిక.ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు. విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "రక్షరేఖ" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది ) తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి. సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలే నాయిక పాత్రలకి వస్తూ ఉంటారు. పెళ్లయ్యాక వచ్చినవాళ్లు ఉంటే,...