తనికెళ్ళ భరణి,Tanikella bharani
=================================== పరిచయం : తనికెళ్ళ భరణి తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమగోదావరిజిల్లా, పోడూరుమండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. సుమారు ౩౦౦ పైన చిత్రాలలో నటించారు. పంచాంగము కుడా చెప్తారు. ప్రొఫైల్ : పేరు :భరణి తనికెళ్ళ , తల్లి ఊరు : జగన్నాధపురం -పోడూరు మండలం-పశ్చిమ గోదావరి జిల్లా , తండ్రి ఊరు : గుండి గోలలామ్(ఏలూరు దగ్గర)పశ్చిమ గోదావరి జిల్లా - రైల్వే ఉద్యోగి అయినందున హైదరాబాద్ వలసివెళ్ళినారు . పుట్టిన తేది : 14 జూలై 1956 . పుట్టిన ఊరు : హైదరాబాద్ , చదువు : థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో , మతము : హిందూ - బ్రహ్మిన్ , భార్య : భవాని , పిల్లలు : ఒక కొడుదు - మహాతేజ , ఒక కూతురు - సౌందర్యలహరి (ఇద్దరు బి.టెక్ చదువుతున్నారు ), నివాసము : సౌందర్యలహరి , డోర్.నెం. 8-3...