Shanvi Srivatsav - శాన్వి శ్రీవత్సవ్
పరిచయం (Introduction) : సీనియర్ సినీ పాత్రికేయురాలు బి. జయ దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌లీ' చిత్రంలో సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడుకాగా, శాన్వి అనే నూతన నటి పరిచయమైంది. ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి , బీకామ్ రెండో సంవత్సరం చేస్తుండగా ఈ సినిమాలో అవకాశం దక్కింది. డిగ్రీ చదువుతూ.. సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించింది శాన్వి. 'లవ్లీ'తో పరిచయమై 'అడ్డా'లో నటించినున్నది .తన మాటల్లో 'ఈ ఏడాదే బీకామ్ పూర్తి చేశా. నేను చదువూ, షూటింగ్‌కి సమ ప్రాధాన్యమిచ్చేదాన్ని. ఎన్ని పనులున్నా చదవకుండా నిద్రపోయేదాన్ని కాదు. దాంతో నిద్రకు కేటాయించే సమయం బాగా తగ్గింది. రోజుకి మూడు నాలుగు గంటలే పడుకునే దాన్ని. మరి తెర మీద అంత చలాకీగా కనిపించడం ఎలా సాధ్యమవుతుందనేగా మీ సందేహం! తెల్లవారు జామున లేవడం నాకలవాటు. ఆ సమయంలో చప్పుళ్లు ఉండవు. ఫోన్లు రావు. ఎవరూ మాట్లాడరు. హాయిగా రెండు గంటలపాటు ప్రాణాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేస్తా. దాంతో అలసట దూరమవుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. సెట్‌లో కూడా ఖాళీ దొరికితే ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అందాన్ని రెట్టింపు ...