అనిల్.ఆర్(సంగీత దర్శకుడు)-Anil.R(music director)
పరిచయం (Introduction) : యువ సంగీత దర్శకుడు అనిల్.ఆర్ (33) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ‘సంభవామి యుగే యుగే’ చిత్రంతో సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ ఆ తర్వాత గమ్యం, నిన్న నేడు రేపు, కళావర్ కింగ్, ఎల్బీడబ్ల్యూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడం పట్ల టాలీవుడ్ వర్గాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే నిశ్చితార్థం జరిగిన అనిల్ వివాహం మేలో జరగాల్సి వుంది. ఈలోపే ఆయన మరణించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయనది గుంటూరు జిల్లా రెంటచింతల స్వగ్రామం. ఇటీవల విడుదలయిన `LBW` చిత్రానికి కూడా ఆయనే సంగీతాన్ని అందించారు. ఆయన సోదరుడు ప్రకాష్,. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ వద్ద గతంలో సహాయ దర్శకునిగా పని చేసివున్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : అనిల్ . ఆర్ , పూర్తి పేరు : Anil Reddy Thumma, ఊరు : రెంటచింతల -- గుంటూరు జిల్లా , చదువు : B.E. at Hyderabad , MBA at Belgium, మరణము : 22-04-2011, సినిమాలు (filmography ): సంభవామి యుగే యుగే--(2005), గమ్యం--(2007), ఏకలౌవ్యుడు --2008), ...