బాపిరాజు అడివి , Bapiraju Adavi
------------------------------------------ పరిచయం : అడివి బాపిరాజు (Adavi Bapiraju) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచే వారు. ప్రొఫైల్ : జననం -- అక్టోబరు 8, 1895--భీమవరం. మరణం-- సెప్టెంబరు 22, 1952 ఇతర పేర్లు-- బాపిబావ వృత్తి -- కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు తండ్రి -- కృష్ణయ్య తల్లి -- సుబ్బమ్మ . కులము : నియోగి బ్రాహ్మిన్, చదువు : బి.ఎ.,బి.ఎల్ , మరణం : సెప్టెంబరు 22, 1952 -. కెరీర్ : బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగి...