Posts

Showing posts with the label Kamalakara Kameswararao-కమలాకర కామేశ్వరరావు

కమలాకర కామేశ్వరరావు,kamalakara Kameswararao

Image
- ------------------------------------------------------ పరిచయమ : సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారత దేశంలోనే మరేభాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవవనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి. అలాంటి చిత్రాలను తీసి పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ప్రొఫైల్ : పేరు : కమలాకర కామేశ్వరరావు , పుట్టిన తేది : x-x-1911 పుట్టిన ఊరు : బందరు చదువు : బి.ఎ - 1933, సినీ విమర్శకునిగా : కృష్ణా పత్రిక లో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూథియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయనవిమర్శలు సాగేవి. ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్ర...